హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ వినియోగదారుల కోసం బడ్జెట్ రేంజ్లో నోకియా 5.4 ఫోన్‌ను యూరప్‌లో ఆవిష్కరించింది. గతేడాది విడుదల చేసిన నోకియా 5.3 ఫోన్‌కు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేయనుంది.
నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో ఈ ఫోన్లు లభించనున్నాయి.
ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు పనిచేయనుంది. ఫోన్లో హోల్ పంచ్ డిస్ప్లే కూడా ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,900గా నిర్ణయించారు. నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
నోకియా 5.4 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే:6.39 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
ర్యామ్:4జీబీ
స్టోరేజ్:64జీబీ
రియర్ కెమెరా: 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా
సెల్ఫీ కెమెరా : 16ఎంపీ(f2.0)
బ్యాటరీ కెపాసిటీ: 4000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10