HomeTelugu technology

అదిరిపోయే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి జీరో 8ఐ
Published By :  Divya Valluru Image Image
Infinix Zero 8i With 16 MP dual selfie shooter launched in India
Saturday Dec 05, 2020
షెన్‌జెన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఇన్ఫినిక్స్‌ జీరో 8ఐ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా, 48 మెగా పిక్సల్‌ ప్రైమరీ రియర్‌ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. 

ఇన్ఫినిక్స్ జీరో 8ఐ స్పెసిఫికేషన్స్‌…

* 6.85 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2460 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్
* 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఇన్పినిక్స్ జీరో 8ఐ స్మార్ట్ ఫోన్ సిల్వర్ డైమండ్‌, బ్లాక్ డైమండ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. 

   Politics

   Lifestyle