HomeTelugu technology

మోటోరోలా మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ విడుదల
Published By :  Sushma Paidipalli Image Image
Motorola launches Moto G 5g affordable smartphone in India
Monday Nov 30, 2020
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మోటోరోలా వినియోగదారుల కోసం మోటో జి 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. మోటోరోలా నుంచి విడుద‌లైన లేటెస్ట్ మిడ్ రేంజ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం.  ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 750జి 5జి ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 10ఓఎస్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. 

మోటో జి 5జి స్పెసిఫికేష‌న్స్‌…

* 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 750జి ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10, అప్‌గ్రేడ‌బుల్ టు ఆండ్రాయిడ్ 11
* 48, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెన్స్
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో ప‌వ‌ర్ ఫాస్ట్ చార్జింగ్

వ‌ల్క‌నిక్ గ్రే, ఫ్రాస్టెడ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లభించే మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.20,999గా ఉంది. దీన్ని డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఈ ఫోన్ పై రూ.1000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

   Politics

   Lifestyle