HomeTelugu technology

నోకియా నుంచి కొత్తగా రెండు 4జీ ఫీచర్ ఫోన్లు
Published By :  Divya Valluru Image Image
HMD Global launches Nokia 8000 4g and Nokia6300 4g feature phones
Friday Nov 13, 2020
హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా కొత్త నోకియా ఫీచర్‌ ఫోన్లను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. నోకియా  6300 4G,  నోకియా 8000 4G పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు వాట్సాప్‌, గూగుల్‌ అసిస్టెంట్‌లను సపోర్ట్‌ చేస్తాయి. ఫేస్‌బుక్, యూట్యూబ్,  గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర సోషల్ మీడియా యాప్‌లను యాక్సెస్‌ చేయొచ్చు.   గూగుల్ అసిస్టెంట్ సాయంతో యూజర్లు    తమ వాయిస్‌ని ఉపయోగించడం ద్వారా సులభంగా ప్రశ్నలు అడగొచ్చు. కాల్ కూడా చేసుకోవచ్చు.  

నోకియా 6300 4జీ స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే: 2.40 అంగుళాలు
రియర్‌ కెమెరా: 0.3 మెగాపిక్సల్‌
స్టోరేజ్‌: 4జీబీ
బ్యాటరీ:1500mAh
ఓఎస్‌: కాయ్ 

నోకియా 8000 4జీ స్పెసిఫికేషన్లు

డిస్‌ప్లే: 2.80 అంగుళాలు
రియర్‌ కెమెరా:  2 మెగాపిక్సల్‌
ర్యామ్: 512 ఎంబీ
స్టోరేజ్‌: 4జీబీ
బ్యాటరీ:1500mAh
ఓఎస్‌: కాయ్ 

నోకియా 6300 4జీ ఫోన్‌ ధర సుమారు రూ.4,320గా ఉండనుంది. నోకియా 8000 4జీ ఫోన్‌ ధర సుమారు రూ.6,966కు లభించనుంది. 6300 మోడల్‌ సియాన్‌ గ్రీన్‌, లైట్ చార్‌కోల్‌, పౌడర్‌ వైట్‌లలో  అందుబాటులో ఉండగా 8000 వేరియంట్‌ ఒనిక్స్‌, ఒపాల్‌, సిట్రిన్‌, టోపాజ్‌ కలర్లలో లభించనుంది.  

   Politics

   Lifestyle