HomeTelugu Technology

షియోమీ నుంచి ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిషన్ ల్యాప్‌టాప్
Published By :  Lasya Raghavaraju Image Image
Xiaomi launches mi notebook 14 e-learning edition laptop
Thursday Nov 05, 2020
షియోమీ సంస్థ ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్‌ పేరిట ఓ నూత‌న ల్యాప్‌టాప్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. దీంట్లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ కోర్ ఐ3-10110యు ప్రాసెస‌ర్‌ కలిగిన ఈ ల్యాప్‌టాప్ ధ‌ర రూ. 36,999గా ఉంది.

షియోమీ ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్ స్పెసిఫికేష‌న్లు…

* 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2.1 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ3-10110యు ప్రాసెస‌ర్‌, ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 620
* 8జీబీ డీడీఆర్‌4 2666 మెగాహెడ్జ్ ర్యామ్‌, 256 జీబీ సాటా ఎస్ఎస్‌డీ
* విండోస్ 10 హోం ఎడిష‌న్, ఇన్‌బిల్ట్ హెచ్‌డీ వెబ్ క్యామ్
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ
* 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌, మైక్రోఫోన్ జాక్‌, డీటీఎస్ ఆడియో
* 46 వాట్ల బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఎంఐ బ్యాండ్ వాడేవారు దాంతో ఈ ల్యాప్‌టాప్‌ను అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. సింపుల్‌గా బ్యాండ్‌ను ల్యాప్‌టాప్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తే చాలు, ల్యాప్‌టాప్ అన్‌లాక్ అవుతుంది. అలాగే ఎంఐ స్మార్ట్ షేర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఈ ల్యాప్‌టాప్‌కు డేటాను సుల‌భంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవ‌చ్చు. దీంట్లో 46 వాట్ల బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి 65 వాట్ల చార్జ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ల్యాప్‌టాప్ వేగంగా చార్జింగ్ అవుతుంది. కేవ‌లం 35 నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ల్యాప్‌టాప్ 0 నుంచి 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ పూర్త‌వుతుంది.

ఎంఐ నోట్‌బుక్ 14 ఇ-లెర్నింగ్ ఎడిష‌న్ అయితే లాంచింగ్ కింద ఈ నెల 11వ తేదీ వ‌ర‌కు రూ.2వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ల్యాప్‌టాప్‌ను అప్ప‌టి వ‌ర‌కు రూ.34,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డుల‌తో ఈ ల్యాప్‌టాప్‌పై అద‌నంగా మ‌రో 10 శాతం వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ధ‌ర మ‌రింత త‌గ్గుతుంది.

   Politics

   Lifestyle