HomeTelugu technology

మోటోరోలా నుంచి కొత్త ఫోన్ మోటో ఈ7 ఫీచర్లు
Published By :  Sushma Paidipalli Image Image
Moto e7 spotted in TUV Certification website 4000mah battery tipped
Saturday Oct 31, 2020
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా బడ్జెట్ ఫోన్ శ్రేణిలో మోటో ఈ7 పేరుతో కొత్త ఫోన్ భరత్ లో త్వరలో లాంచ్ చేయనుంది. రూ. 10వేల లోపే లభించనున్న ఈ ఫోన్ ఇప్పటికే యూఎస్ ఎఫ్‌సీసీ, థాయ్‌ల్యాండ్ ఎన్బీటీసీ, టీయూవీ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. మోటో ఈ 7 ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. 

ఇందులో 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు.  ఈ ఫోన్ XT2095-3 అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం ఈ ఫోన్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ 5W చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. వైఫై, ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను కూడా ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ అందించారు.

మోటో ఈ7 ఫీచర్లు

* 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే,
* 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 
* 13+2 మెగా పిక్సెల్ రేర్ డ్యూయల్ కెమెరా సెటప్, 
* 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

   Politics

   Lifestyle