HomeTelugu technology

మైక్రోమాక్స్ నుంచి త్వరలో రానున్న ఇన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు
Published By :  Divya Valluru Image Image
Micromax set to launch new in series budget smartphones
Friday Oct 23, 2020
భారతీయ ప్రముఖ మొబైల్  బ్రాండ్ 'మైక్రోమక్స్' తన సబ్ బ్రాండ్ ‘ఇన్’ ద్వారా పరిమిత బడ్జెట్‌లో పూర్తిగా ఇండియాలో తయారైన సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ‘In’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను వర్చువల్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ తెలిపారు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ధర రూ. 7,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుందన్నారు. Helio G35 ప్రాసెసర్, 3GB RAM, 32GB స్టోరేజ్, 6.5-inch HD+ display, 5000mah బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉంటాయని సమాచారం. భారత్-చైనా ఉద్రిక్తతల ముందే ‘In సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ తాయారు చేయడం మొదలుపెట్టిందని.. ఈ స్మార్ట్‌ఫోన్ మోడళ్లన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయబడ్డాయని రాహుల్ శర్మ అన్నారు. అంతేకాదు ఈ ‘In’ సిరీస్ స్మార్ట్ ఫోన్లలకు బ్లోట్‌వేర్, యాడ్స్ ఉండవన్నారు.

గతేడాది అక్టోబర్ లో ఐవన్ నోట్ ను విడుదల చేసిన తర్వాత మైక్రోమ్యాక్స్ మరో కొత్త మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేయలేదు. 

   Politics

   Lifestyle