HomeTelugu Technology

భారత మార్కెట్లోకి కొత్తగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్లు
Published By :  Divya Valluru Image Image
Nokia launches two new Feature phones into Indian market
Tuesday Oct 20, 2020
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్లను తీసుకువచ్చింది.  నోకియా  215 4G, నోకియా  225 4G పేరుతో విడుదలైన ఈ ఫీచర్‌ ఫోన్లను ఈనెల ఆరంభంలోనే చైనాలో రిలీజ్‌ చేశారు.  ఫంక్షన్‌ కీ(కీప్యాడ్‌)లు కలిగివున్న నోకియా 225 4జీ ఫోన్‌ వెనకవైపు కెమెరా కూడా ఉంది. నోకియా 215 4జీ ధర రూ.2,949 కాగా నోకియా 225 4జీ ఫోన్‌ ధర రూ. 3,499గా నిర్ణయించారు. 

నోకియా 215 4జీ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 2.40 అంగుళాలు
ప్రంట్‌ కెమెరా:  లేదు
రియర్‌ కెమెరా: లేదు
ర్యామ్‌: 64 ఎంబీ
స్టోరేజ్‌:  128 ఎంబీ
బ్యాటరీ:  1150mAh
ఓఎస్‌:Series 30+

నోకియా 225 4జీ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 2.40 అంగుళాలు
ప్రంట్‌ కెమెరా: లేదు
రియర్‌ కెమెరా: 0.3 మెగాపిక్సల్‌
ర్యామ్‌: 64 ఎంబీ
స్టోరేజ్‌: 128 ఎంబీ
బ్యాటరీ:1150mAh
ఓఎస్‌: Series 30+

నోకియా 215 మోడల్‌ బ్లాక్‌, సియాన్‌ గ్రీన్‌ కలర్లలో  అందుబాటులో ఉంది. 225 ఫీచర్‌ ఫోన్‌ బ్లాక్‌, క్లాసిక్‌ బ్లూ, మెటాలిక్‌ సాండ్‌ కలర్లలో విడుదలైంది.  అక్టోబర్‌ 23 నుంచి నోకియా ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. నవంబర్‌ 6 నుంచి యూజర్లు ఆఫ్‌లైన్‌ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. 

   Politics

   Lifestyle