HomeTelugu technology

రిలయన్స్‌‌‌‌ జియో నుంచి రూ.3 వేల లోపే 5జీ ఫోన్
Published By :  Divya Valluru Image Image
Reliance Jio planning to launch 5G smartphones under Rs. 3000 apiece
Monday Oct 19, 2020
టెలికం రంగంలో సంచలనాలకు వేదిక అయిన ముకేశ్‌ అంబానీ నిర్వహణలోని రిలయన్స్‌ జియో అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లను భారతీయులకు పరిచయం చేయాలని యోచిస్తోంది.  ప్రస్తుతం ఇండియాలో 5జీ టెక్నాలజీ లేకున్నా, ఇలాంటి ఫోన్ల ధరలు రూ.25 వేలకు పైగానే ఉన్నాయి. ఈ తరుణంలో రిలయన్స్‌‌‌‌ జియో మాత్రం రూ.మూడు వేలలోపే 5జీ ఫోన్‌‌‌‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది బేసిక్ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ తమవైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో 5జీ చవక స్మార్ట్‌ఫోన్లను అందివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  మొదట్లో దీని రేటు రూ.ఐదు వేల వరకు ఉన్నా, అమ్మకాలు పెరిగే కొద్దీ ధర రూ.మూడు వేలకు తగ్గిస్తామని జియో సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఒకరు అన్నారు.

మనదేశంలో అత్యంత తక్కువ రేటుతో 4జీ ఫోన్‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేసింది కూడా జియోనే! కేవలం సెక్యూరిటీ డిపాజిట్‌‌‌‌గా రూ.1,500 తీసుకుంది. కొంతకాలం తరువాత ఫోన్‌‌‌‌ వద్దనుకుంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చింది. ముంబైలో జరిగిన 43వ ఏజీఎంలో రిలయన్స్ చైర్మన్‌‌‌‌ ముకేశ్‌‌‌‌ అంబానీ మాట్లాడుతూ మనదేశంలో 2జీ, ఫీచర్ ఫోన్‌‌‌‌ యూజర్లను తక్కువ ధర స్మార్ట్‌‌‌‌ఫోన్ల ద్వారా 5జీ టెక్నాలజీవైపు తీసుకెళ్లాలని అన్నారు. జియోలో 7.7 శాతం వాటాను రిలయన్స్‌‌‌‌ గూగుల్‌‌‌‌కు అమ్మింది. అండ్రాయిడ్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ కోసం రెండు కంపెనీలు కలసి పనిచేస్తాయని అంబానీ వెల్లడించారు. 

ఇదిలా ఉంటే, తమ సొంత నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌తోనే 5జీ ట్రయల్స్‌‌‌‌ నిర్వహించడానికి తమకు స్పెక్ట్రమ్‌‌‌‌ ఇవ్వాలని రిలయన్స్‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

   Politics

   Lifestyle