HomeTelugu technology

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 వచ్చేసింది
Published By :  Lasya Raghavaraju Image Image
Samsung launches Galaxy F41 with Triple rear camera in India
Friday Oct 09, 2020
 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త‌గా ఎఫ్ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్‌41 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేసింది. గెలాక్సీ ఎఫ్-సిరీస్‌లో మొదటిదిగా విడుదలైన ఈ ఫోనులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఎగ్జినోస్ 9611 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 6జీబీ వ‌ర‌కు ర్యామ్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక వైపు 64, 8, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.  

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌41 స్పెసిఫికేష‌న్లు…

* 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్
* 6జీబీ ర్యామ్‌, 64, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
*     ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
*    డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
*    బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

గెలాక్సీ ఎఫ్‌41 ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,999గానూ నిర్ణయించారు. ఫ్యూజన్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ, ఫ్యూజన్ బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 191 గ్రాములుగానూ ఉంది. . 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 

దీని సేల్ అక్టోబర్ 16 నుంచి జరగనుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా దీన్ని విక్రయించనున్నారు.

   Politics

   Lifestyle