HomeTelugu technology

బడ్జెట్ ధరలో లాంచ్ అయిన షావోమి 'పోకో సీ3'
Published By :  Divya Valluru Image Image
xiaomi sub brand Poco launches poco c3 in India for Rs 7,499
Wednesday Oct 07, 2020
ప్రముఖ చైనీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సబ్ బ్రాండ్ పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా న కొత్త పోకో సీ3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.  ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10W ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో ఉన్నాయి. 

పోకో సీ 3 ఫీచర్లు

* 6.53 అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే,
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 
* 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,
* 13+2+2 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్,
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

ఇక ధర విషయానికి వస్తే 3 జీబీ ర్యామ్+32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్+64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ లైమ్ గ్రీన్, ఆర్కిటిక్ బ్లూ, మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానుంది. అక్టోబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్ కానుంది.

   Politics

   Lifestyle