HomeTelugu technology

భారత మార్కెట్లోకి మోటోరోలా మోటో ఈ7 ప్లస్
Published By :  Lasya Raghavaraju Image Image
Motorola launches Moto E7 Plus in India for Rs 9,499
Thursday Sep 24, 2020
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మోటోరోలా ఇండియాలో ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. మోటో ఈ7 ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలో బ్రెజిల్ మార్కెట్‌లో రిలీజ్ చేసారు. ఇప్పుడు అదే స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. 

మోటో ఈ7 ప్లస్ ఫోనులో టెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే మోటో ఈ7 ప్లస్ రిలీజ్ కావడం విశేషం. ధర రూ.9.499. 

మోటో ఈ7 ప్లస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5హెచ్‌డీ+
ర్యామ్: 4జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్
ధర: రూ.9,499

ఇప్పటికే రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్, రియల్‌మీ నార్జో 20ఏ లాంటి మోడల్స్‌కు మోటో ఈ7 ప్లస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.

   Politics

   Lifestyle