HomeTelugu technology

టిక్ టాక్ కు పోటీగా యూట్యూబ్ "షార్ట్స్" వచ్చేసింది
Published By :  Divya Valluru Image Image
YouTube rolls out TikTok rival Shorts initially in India
Tuesday Sep 15, 2020
చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ను భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం నిషేధించింది. టిక్ టాక్ బ్యాన్ తర్వాత చింగారి, రొపోసో, ఇంస్టాగ్రామ్ రీల్స్ అప్లికేషన్స్ వచ్చినప్పటికీ టిక్ టాక్ మాదిరిగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ కూడా షార్ట్స్ పేరుతో టిక్ టాక్ తరహా వీడియో షేరింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాఫ్ఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతానికి ‘షార్ట్స్’ మొబైల్ యాప్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. 15 సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను చిత్రీకరించే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఆప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. ఇందులో స్పీడ్ కంట్రోల్స్, హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడించి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. 

ఈ యాప్ లో టిక్ టాక్ తరహాలో షార్ట్స్ వీడియోస్, క్రియేటీవ్ వీడియోస్ ను షూట్ చేసుకునే అవకాశం ఉందని , త్వరలో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. 

   Politics

   Lifestyle