HomeTelugu technology

మోటరోలా మోటో జీ9 ప్లస్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
Published By :  Divya Valluru Image Image
Motorola Moto G9 Plus officially launched in Brazil
Friday Sep 11, 2020
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్‌ మోటోరోలా త‌న‌ సరికొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ9 ప్లస్ ను  ఆవిష్కరించింది. మోటో జీ9  సిరీస్‌లో మోటో జీ9, మోటో జీ9 ప్లే తర్వాత విడుదలైన అతిపెద్ద ఫోన్‌ ఇదే. జీ9 ప్లస్‌ను మొదట బ్రెజిల్‌లో విడుదల చేసింది. రోజ్ గోల్డ్, ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

జీ9 ప్లస్ 6.8 అంగుళాల ఎఫ్ హెచ్ డీ ప్లస్ మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ను కలిగి ఉంది.  ఇందులో 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఎనిమిది ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్, రెండు ఎంపీ స్థూల లెన్స్ మరియు రెండు ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అదే సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. మోటో జీ9 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ని, ఇందులో ముప్పై వాట్టర్ పవర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ను కలిగి ఉంది.

త్వరలోనే భారత్‌తో పాటు మిగతా దేశాల్లోనే రిలీజ్‌ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు చేస్తున్నది. జీ9 ప్లస్‌ ధర సుమారు రూ.31,000గా ఉండనుంది. ఐతే మార్కెట్‌ను బట్టి ఫోన్‌ ధర మారుతుంది. 

మోటో జీ9 ప్లస్‌ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే:6.80 అంగుళాలు
ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ
ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌: 4జీబీ
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ: 5000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10 

   Politics

   Lifestyle