HomeTelugu Technology

భారత మార్కెట్లోకి వచ్చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌
Published By :  Sushma Paidipalli Image Image
Samsung Galaxy M51 launched in India with 7000 MaH battery
Thursday Sep 10, 2020
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లోకి గెలాక్సీ ఎం51 పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన అతిపెద్ద బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా, హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్ వంటివి గెలాక్సీ ఎం51 ఫోనులో ఆకట్టుకునే అంశాలు.

ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో స్నాప్ డ్రాగ‌న్ 730జి అధునాత‌న ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ను అందించారు. 6, 8 జీబీ ర్యామ్ మోడ‌ల్స్‌లో విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. రెండు 4జి సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు వేసుకునేందుకు మొత్తం 3 స్లాట్ల‌ను ఇచ్చారు.

గెలాక్సీ ఎం51 ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరాతోపాటు 12, 5, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఫోన్‌కు ప‌క్క భాగంలో ఉంటుంది. అద్భుత‌మైన ఆడియో కోసం డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 5.0 ఉంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టు ద్వారా ఈ ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవ‌చ్చు. 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఉంది. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.

గెలాక్సీ ఎం51 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 24,999 కాగా, 8జీబీ వేరియంట్ ధర రూ. 26,999 మాత్రమే. ఎలక్ట్రిక్ బ్లూ, కెలెస్టియల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, శాంసంగ్ డాట్ కామ్‌లలో తొలి సేల్ ప్రారంభం కానుంది. అలాగే, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలోనూ లభ్యం కానుంది.

   Politics

   Lifestyle