HomeTelugu technology

భారత మార్కెట్లోకి రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్‌ ధర కేవలం రూ.1599
Published By :  Divya Valluru Image Image
Xiaomi Redmi Smartband launched in India at Rs 1,599
Tuesday Sep 08, 2020
మొబైల్స్ త‌యారీదారు షియోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ మొట్టమొదటి స్మార్ట్‌బ్యాండ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.   ఇందులో 1.08 ఇంచుల చ‌తుర‌స్రాకార క‌ల‌ర్ టచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.  సులభంగా ఛార్జింగ్‌ కోసం ఇంటిగ్రేటెడ్‌ యూఎస్‌బీ ప్లగ్‌తో వస్తున్నది.   హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌తో పాటు, స్లీప్‌  ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రెడ్‌మీ స్మార్ట్‌బ్యాండ్‌ 14 రోజుల బ్యాటరీ స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.  2 గంటల్లో 100శాతం  ఛార్జింగ్‌ అవుతుందని  వెల్లడించింది.  బ్లూటూత్ 5.0 ద్వారా ఈ బ్యాండ్ ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. స్టెప్ కౌంట‌ర్‌, యాప్స్‌, కాల్స్ నోటిఫికేష‌న్లు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

సెప్టెంబర్‌ 9, బుధవారం  మధ్యాహ్నం  ఒంటి గంట నుంచి అమెజాన్‌, ఎంఐ డాట్‌కామ్‌, ఎం హోమ్‌ స్టోర్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు.  భారత్‌లో స్మార్ట్‌బ్యాండ్‌ ధర రూ.1,599 కాగా, బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌, ఆరెంజ్‌ కలర్లలో అందుబాటులో ఉంది.    

   Politics

   Lifestyle