HomeTelugu technology

వ‌న్‌ప్ల‌స్ సంస్థ నుంచి రూ.10వేలకే బడ్జెట్ ఫోన్
Published By :  Lasya Raghavaraju Image Image
OnePlus set to launch budget phone under Rs 10000
Saturday Sep 05, 2020
ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌ తయారీదారుగా మంచి పేరు సంపాదించిన వ‌న్‌ప్ల‌స్ సంస్థ నుంచి త్వరలో బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌ ఫోన్లపై ప్రస్తుతం వన్ ప్లస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో 'వన్‌ప్లస్‌ నార్డ్‌ లైట్‌' తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్న ఈ సంస్థ త్వరలో రూ.10వేల లోపు బడ్జెట్ ఫోనును తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  

వ‌న్‌ప్ల‌స్ బడ్జెట్‌ ఫోన్‌ ఫీచర్స్‌

* రేర్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
* ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, 13 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సర్‌
* బ్యాటరీ: 6000 ఎంఏహెచ్‌
* స్నాప్‌డ్రాగన్‌ 460 ఎస్‌వోసీ
* 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
* స్క్రీన్‌ రిసొల్యూషన్‌: 720X1,560 పిక్సెల్స్
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

   Politics

   Lifestyle