HomeTelugu technology

సాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ రిలీజ్ రూ. 8,999 మాత్రమే
Published By :  Lasya Raghavaraju Image Image
Samsung releases Galaxy M10S for Rs 8,999
Wednesday Sep 18, 2019
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకెళ్తున్న సాంసంగ్ భారత మార్కెట్లోకి బడ్జట్ వినియోగదారుల కోసం ఈ రోజు మరో కొత్త ఫోన్ విడుదల చేసింది. గెలాక్సీ ఎం10ఎస్ పేరుతో 6.4 అంగుళాల డిస్‌ప్లేతో విడుదలైన ఈ ఫోన్ ధరని రూ. 8,999గా నిర్ణయించారు.

స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే గెలాక్సీ ఎం10ఎస్ ఫోన్ 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884బి ప్రాసెసర్ తో పనిచేస్తోంది. 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ, డ్యుయల్ సిమ్, 13,5 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో  గెలాక్సీ ఎం10ఎస్ రానుంది.  బ్యాటరీ 4000 ఎంఏహెచ్. అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఈనెల 29 నుంచి అమెజాన్,శాంసంగ్ ఇండియా సెంటర్లలో అందుబాటులోకి రానుంది. 

గెలాక్సీ ఎం10ఎస్ ఫీచర్లు ఇవే : 

డిస్ప్లే : 6.4 అంగుళాలు
ర్యామ్ :  3జీబీ
స్టోరేజ్ : 32 జీబీ, డ్యుయల్ సిమ్
కెమెరా : 13,5 ఎంపీ బ్యాక్ కెమెరా
               8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 
బ్యాటరీ : 4000ఎంఏహెచ్