HomeTelugu technology

మోటోరోలా నుంచి మోటో ఈ6ఎస్ వచ్చేసింది
Published By :  Ravi Koneri Image Image
Motorola launches Moto E6S budget smartphone for Rs 7,999
Monday Sep 16, 2019
దేశీయ మొబైల్ దిగ్గజం మోటరోలా వినియోగదారుల కోసం ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. మోటో ఈ6ఎస్ పేరుతో 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ గల ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.7,999 మాత్రమే. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మోటో ఈ6ఎస్ సేల్ సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. 

మోటో ఈ6ఎస్ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్‌బ్యాక్, రూ.3,000 ఓచర్లు కూడా లభించనున్నాయి. ఈ ఫోన్ పాలిష్డ్ గ్రాఫైట్, రిచ్ క్రాన్‌బెర్రీ రంగుల్లో లభించనున్నాయి. 
 
మోటో ఈ6ఎస్ ప్రత్యేకతలు

  •  6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
  •  డ్యూయెల్ సిమ్, 4 జీబీ ర్యామ్, 
  •  64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
  •  మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్,
  •  13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా,
  •  8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
  •  3000 ఎంఏహెచ్ బ్యాటరీ,
  •  ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్,