HomeTelugu technology

యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయి ; స్పెసిఫికేషన్స్
Published By :  Lasya Raghavaraju Image Image
Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max launched
Wednesday Sep 11, 2019
మార్కెట్లోకి ఎన్ని ఫోన్లు వచ్చిన జనాల్లో ఐఫోన్ కి ఉండే క్రేజ్ తగ్గట్లేదు. యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందా, ఎప్పుడు దానిని కొనేద్దామా అని ఎందరో ఎదురు చూస్తుంటారు. అలంటి వారికోసం యాపిల్ కంపెనీ ఈ రోజు కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. అత్యంత శక్తిమంతమైన ఏ13 బయోనిక్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఫోన్ల ప్రత్యేకతగా సంస్థ పేర్కోంది. 

ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీనిలో 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ర్యామ్ 4 జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 రియర్ కెమెరా 12+12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,110 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర: రూ.64,900. 

ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీనిలో 5.8 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ర్యామ్ 6 జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 ప్రో రియర్ కెమెరా 12+12+12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,190 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 ప్రో స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్‌నైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.99,900.

ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీనిలో 6.5 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ర్యామ్ 6 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ రియర్ కెమెరా 12+12+12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,190 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్‌నైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.1,09,900.

ఇండియాలో సెప్టెంబర్ 27న ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ సేల్ ప్రారంభం కానుంది.