HomeTelugu technology

గేమింగ్ ప్రియులకోసం వివో జెడ్‌1 ఎక్స్‌
Published By :  Divya Valluru Image Image
Vivo Z1x with 48-Megapixel Triple Rear Camera launched
Friday Sep 06, 2019
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో మరో కొత్త ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. వివో జెడ్‌ సిరీస్‌లో వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ భారీ గ్రాఫిక్స్ గల గేమ్స్ ఆడటానికి ఇష్టపడే వినియోగదారుల కోసం రూపొందించబడింది.  వివో జెడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్.  

ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో  లాంచ్‌ అయిన వివో జెడ్ 1 ఎక్స్ ఫోనులో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌, 22 వాట్‌ ఫ్లాష్‌చార్జ్‌ స్పెషల్‌ ఫీచర్లుగా ఉన్నాయి.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్,  వివో  ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వివో జెడ్ 1 ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.   

వివో జెడ్ 1 ఎక్స్   ఫీచర్లు

6.38-అంగుళాల సూపర్ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే  
స్నాప్‌డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9 పై  
48+ 2+8 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌  కెమెరా . 
32 ఎంపీ సెల్పీ కెమెరా
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ