HomeTelugu technology

మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ గో ట్యాబ్ విడుదల, ఫీచర్లు ఇవే
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Microsoft Surface Go price in india, specifications and features
Thursday Dec 20, 2018
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. సరికొత్త ఫీచర్లతో సర్ఫేస్ గో పేరిట 2 ఇన్ 1 ట్యాబ్లెట్ పీసీని భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇందులో 10 ఇంచ్ డిస్‌ప్లేను, ఇంటెల్ 7వ జనరేషన్ పెంటియం గోల్డ్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇక కీ బోర్డు కవర్‌ను ఈ ట్యాబ్‌కు ఆప్షనల్‌గా అందిస్తున్నారు. అలాగే ఈ ట్యాబ్‌ను ఒక్కసారి పుల్ చార్జింగ్ చేస్తే 9 గంటల వరకు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2 ఇన్ 1 ట్యాబ్‌లో 8 జీబీ ర్యామ్  యూఎస్‌బీ టైప్ సి, మైక్రో ఎస్‌డీ కార్డు రీడర్, విండోస్ హలో కెమెరా, ఫేస్ రికగ్నిషన్ తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌కు చెందిన 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.38,599 ఉండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.50,999 ధరకు లభిస్తున్నది.