HomeTelugu technology

రూ.78తో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్
Published By :  Dhanunjaya Vallivedu Image Image
BSNL launches rs 78 prepaid plan with 20 GB data and unlimited calls
Saturday Nov 24, 2018
ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - బీఎస్ఎన్ఎల్ తాజాగా ఓ కొత్త ప్లాన్ ని తీసుకు వచ్చింది. ఈ రీచార్జ్ విలువ రూ. 78గా ఉంది. వినియోగదారులని ఆకట్టుకోవడానికి ఈ ప్లాన్ విడుదల చేసినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. రూ. 78 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కాలింగ్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 10 రోజుల పాటు 20 జీబీ డేటా వాడుకోవచ్చట. ఈ ప్లాన్ వేలిడిటీ 10 రోజులు మాత్రమే అని తెలిపింది. బీఎస్ఎన్ఎల్‌కు చెందిన 22 సర్కిళ్లలో ఈ ప్లాన్ వాడుకోవచ్చు. యూజర్లకు 2జీ/3జీ డేటా బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. 123 నెంబర్‌కు 'STV COMBO78' మెసేజ్ పంపించి అన్‌లిమిటెడ్ వీడియో కాలింగ్ ఆప్షన్ వాడుకోవచ్చు.