HomeTelugu serials

కథలో రాజకుమారి సీరియల్ నటీనటులు, పూర్తివివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Kathalo Rajakumari Serial cast and crew
Saturday Mar 10, 2018

స్టార్ మాలో ప్రసారమవుతున్న డైలీ సీరియల్ 'కథలో రాజకుమారి'(Kathalo Rajakumari). ఈ సీరియల్ ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.00ల నుండి 9.30 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ ఓ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ఆషిక గోపాల్, అన్షు రెడ్డి, మధుసూదన్, మరియు కృతిక ప్రధాన తారాగణంగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సీరియల్ కి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. మల్లిక్ సంగీతం అందించిన ఈ సీరియల్ కి విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

మాటీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మొత్తం ఓ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. అవని అనే ఒక అందమైన పనిమనిషి ఆ ఇంటి యజమాని కొడుకు అక్షయ్ ని పెళ్లి చేసుకోవడంతో మొదలయ్యే సమస్యలు, తోడికోడళ్ళు ఏ విధంగా అవనిని హింసించారు, ఆ సమస్యలను అవని ఏ విధంగా ఎదుర్కొనింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సీరియల్ ని తెరకెక్కించారు.

Kathalo Rajakumari Actors:
Ashika Gopal
Madhusudhan(Naa Peru Meenakshi actor)
Krithika
Anshu Reddy

Kathalo Rajakumari Crew:
Production: Annapurna Studios
Music: Mallik
Director: Vijay Krishna

   Politics

   Lifestyle