హిందీలో విజయవంతంగా ప్రసారమయిన 'వేటాడే నాగిని' (హిందీలో 'Naagin')దక్షణాది భాషల్లో ప్రసారం అవుతూ సంచలనాలు సృష్టించింది. నాగిన్ (Naagin)లో ప్రధాన పాత్ర పోషించిన మౌనీ రాయ్ (
Mouni Roy).. నాగిన్-2లోనూ ప్రాధాన పాత్ర పోషించింది. కలర్స్ చానెల్ లో 2015 నవంబర్ 1 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమైన నాగిన్ సీరియల్.. 2016 జూన్ లో ముగిసింది.
దానికి కొనసాగింపుగా రూపొందించిన 'నాగిన్-2 (Naagin 2)' అక్టోబర్ 8 నుంచి అదే చానెల్ లో ప్రసారమయ్యి 25 జూన్ 2017 వరకు కొనసాగింది. తెలుగు సహా తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సీరియల్ ప్రసారమయింది.
ఈ సీరియల్ ని ఏక్తా కపూర్ మరియు శోభ కపూర్ లు కలిసి నిర్మించారు. మౌని రాయ్ (
Mouni Roy) తో పాటు, అర్జున్ బిజ్లాని, అదా ఖాన్ మరియు సుధా చంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.