ఈ టీవీలో ప్రసారమవుతున్న డైలీ సీరియల్ 'ఆడదే ఆధారం'(Aadade Aadharam). ఈ సీరియల్ ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3.30ల నుండి 4.00 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ కథ మొత్తం ఓ మహిళ అమృత చుట్టూ తిరుగుతుంది.
వికాష్ అనే వ్యక్తి కళ్ళు బాగా ధనవంతురాలైన రేణుక మీద పడుతుంది. దీంతో రేణుకను కిడ్నాప్ చేయాలనీ అతడి స్నేహితుడు సాగర్ కి చెప్తాడు. అయితే రేణుకను కిడ్నాప్ చేయబోయి అమృతను కిడ్నాప్ చేస్తాడు. అయితే మరుసటి రోజు అమృతను వదిలేస్తారు. అయితే హాస్టల్ వెళ్ళిన తరువాత అమృతను అందరూ అసహ్యయించుకుంటారు. తన కుటుంబ సభ్యులే అమృతను చెడిపోయిన ఆడదిగా అవమానపాలు చేస్తారు. దీంతో సమాజంలో ఆమెకు ఎదురవుతున్న కష్టాలను, అవమానాలను ఏవిధంగా ఎదుర్కుంటుందో అనేదే ఈ సీరియల్ కథ.
ఆడదే ఆధారం (aadade aadharam) సీరియల్ లో లక్ష్మీ శ్రీ, మధు, మధులిక, పల్లవి (Pallavi), రాజశ్రీ, సాధన, సింధూర, శోభ మరియు సుజాత రెడ్డి తదితరులు నటించారు.