HomeTelugu serials

కోయిలమ్మ సీరియల్ పూర్తి వివరాలు
Published By :  Lasya Raghavaraju Image Image
Koilamma serial cast and crew, complete details
Friday Feb 23, 2018
మాటీవీలో ప్రసారమవుతున్న 'కోయిలమ్మ' సీరియల్ అందరి మన్ననలను పొందుతూ విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8.00ల నుండి 8.30గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో కథ మొత్తం చిన్ని అనే బాలిక చుట్టూ తిరుగుతుంది.

చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన చిన్ని తన మేనమామ దగ్గర ఉంటుంది. చిన్నీకి సంగీతం అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక సింగర్ అవ్వాలని కళలు కంటూ ఉంటుంది అయితే తన మేనత్త పెట్టే బాధలు తట్టుకోలేక ఇంటినుంచి పారిపోతుంది. అయితే చివరికి తన తండ్రి ఉండే ఇంటికే చేరుతుంది. అక్కడే సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ చిన్నీని సవతితల్లి హింసలు పెడుతూ ఉంటుంది. అయితే ఓ ఘటనలో చిన్ని మతిస్థిమితం కోల్పోతుంది. చివరికి తన తండ్రి చిన్నీయే తన కూతురు అని తెలుసుకున్నాడా..? సవతి తల్లి మంచిదానిగా మారుతుందా..? చిన్ని సింగర్ అవుతుందా..? ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన అంశాలు చూడాలంటే కోయిలమ్మ సీరియల్ చూడాల్సిందే.

ఈ సీరియల్ లో చిన్నిగా హారిక, చిన్ని తండ్రిగా సాయి కిరణ్ , అనిత చౌదరి అలాగే నటి శ్రావంతి ముఖ్య తారాగణంగా నటించారు.

   Politics

   Lifestyle