HomeTelugu reviews

సూర్య ఆకాశం నీ హద్దురా రివ్యూ
Published By :  Lasya Raghavaraju Image Image
Suriya Aakasam Nee Haddura Review
Thursday Nov 12, 2020
కథ :

 చంద్ర మహేష్ (సూర్య) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. స్కూల్ మాస్ట‌ర్‌ అయిన తండ్రిపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఏయిర్‌ఫోర్స్‌లో చేర‌తాడు. ధ‌నుకుల‌కు మాత్ర‌మే సొంత‌మైన విమాన యానాన్ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని క‌ల‌లు కంటాడు. ఈ ప్రయత్నంలో అత‌నికి అడుగ‌డుగునా అడ్డంకులు.. చీత్కారాలు ఎదుర‌వుతాయి. తన ఐడియాను మహెష్ ఇండియాలోనే నంబ‌ర్‌వ‌న్ ఏయిర్‌వేస్‌కి అధినేత అయిన ప‌రేష్ గో స్వామి( ప‌రేష్ రావ‌ల్‌)కు చెబుతాడు. మ‌హా ఐడియాని తిర‌స్క‌రించిన గోస్వామి అది కార్య‌రూపం దాల్చ‌కుండా అడుగ‌డుగునా అడ్డుత‌గులుతాడు.  తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ?  ఇక ఇందులో అతని భార్య సుందరి (అప్రర్ణ), పరేష్ గోస్వామి (పరేష్ రావెల్), భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) ఏం చేశారు అనేదే సినిమా.

నటీనటుల పనితీరు:

సూర్య ఎంత మంచి నటుడో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. చంద్ర మహేష్ పాత్రలో సూర్యఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు. సూర్య నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రంగా ‘ఆకాశం నీ హద్దురా’ నిలుస్తుంది. ఇక భర్తను ప్రోత్సహించే భార్య పాత్రలో అపర్ణ నటన అద్భుతం అని చెప్పాలి.  భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్ బాబు నటన మరోకోణంలో ఉంటుంది.  సూర్య లక్ష్యాన్ని అడుగడుగునా అడ్డుకునే విలన్ పాత్రలో పరేష్ రావల్ మెప్పించాడు.  అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: 

'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఒక నిజ జీవిత కథ. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా వచ్చిన 'సింప్లీ ఫ్లై' అనే పుస్తకంలోని కథకు సినిమా హంగులు చేర్చి ఈ 'ఆకాశం నీ హద్దురా'' సినిమా రూపొందించారు. డిఫిక‌ల్డ్ స్టోరీని ఎంచుకుని దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన తీరుకు ఆమెని అబినందించాల్సిందే.  ఎంచుకున్నది వాస్తవ కథే అయినా దాన్ని స్క్రీన్ మీదికి తీసుకురావడంలో చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వినోదాన్ని, పాటలను జోడించి సినిమా నడిపించారు. జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ‘ఆకాశం నీ హద్దురా’కు అతి పెద్ద బలాల్లో ఒకటి. ఎమోషనల్ సన్నివేశాలను అతను నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన తీరు అధ్బుతం. ఈ చిత్రానికి నిఖిత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచింది. స‌తీష్ సూర్య ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. రాకేందు మౌళి చక్కని మాటలు అందించారు.

ప్లస్ పాయింట్స్: 

సూర్య నటన
స్క్రీన్ ప్లే 

మైనస్ పాయింట్స్: 

నిడివి, అనవసరపు సన్నివేశాలు 

చివరిమాట : `ఆకాశం నీ హ‌ద్దురా` ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. సూర్య ఫాన్స్ తో పాటు ప్ర‌తీ ఒక్క‌రి మ‌న‌సుని హ‌త్తుకుంటుంది.


   Politics

   Lifestyle