HomeTelugu reviews

వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ
Published By :  Lasya Raghavaraju Image Image
World Famous Lover Review
Friday Feb 14, 2020
కథ 

గౌతమ్ (విజయ్ దేవరకొండ) రచయిత కావాలనే తన ప్యాషన్ కారణంగా ఉన్న జాబ్ ను కూడా వదిలేసుకుంటాడు. తన ప్యాషన్ ను చేరుకునే క్రమంలో కాలేజీ నుండి లవ్ చేస్తూ ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యామిని (రాశి ఖన్నా)ను విస్మరిస్తుంటాడు. దీన్ని భరించలేని యామిని గౌతమ్ ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఆవేశంలోనే బొగ్గు గని కార్మికుడైన శీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్) జంట కథని రాయడం మొదలుపెడతాడు గౌతం. శీనయ్యకి సువర్ణ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్లిద్దరి మధ్యకి స్మిత (కేథరిన్ ) వస్తుంది. స్మిత ఎవరు? ఆమె వచ్చాక ఆ ఇద్దరి కథలో ఏం జరిగింది? గౌతమ్ రాసిన ఈజా (ఈసాబెల్లె)తో ప్రేమకథ ఎలాంటిది? యామినితో గౌతమ్ లవ్ స్టోరీ చివరికి ఏ టర్న్ తీసుకుంది, వీళ్ళందరికీ ఏమైనా కనెక్షన్ ఉందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రదర్శన

విజయ్ దేవరకొండ నటన సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆయన నాలుగు రకాల పాత్రల్లో అదరగొట్టాడు. విజయ్ నుండి ఎంత రాబట్టలో అంత రాబట్టాడు క్రాంతి మాధవ్.  ముఖ్యంగా బొగ్గుగనిలో శీనయ్య పాత్రలో ఒదిగిపోయాడు. సువర్ణగా కనిపించిన ఐశ్వర్య రాజేష్ మనసుల్ని దోచేసింది. ఈ సినిమా తో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు పెరగడం ఖాయం. శీనయ్య-సువర్ణ ఎపిసోడ్ ఉన్నంత సేపు సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది.  రాశిఖన్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చాలా రోజుల తర్వాత నటిగా ఈమెకు చాలా మంచి పాత్ర వచ్చింది. కొన్నిచోట్ల ఆమెతో కాస్త అతిగా నటింపజేసిన అనుభూతి కలుగుతుంది. కేథరిన్ పాత్రకి ఏమాత్రం 
ప్రాధాన్యం లేదు. ఈసాబెల్లే పాత్రైనా ద్వితీయార్థంలో కీలకంగా కనిపిస్తుంది. గౌతమ్ స్నేహితుడిగా ప్రియదర్శి పాత్ర రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైంది. శత్రు, ఆనంద చక్రపాణి, జయప్రకాశ్ లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం 

దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ దానిని స్క్రీన్ పై చూపించడంలో మాత్రం చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గోపి సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు.. పాటలు ఆకట్టుకోలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను.. ముఖ్యంగా సింగరేణి విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది కానీ సెకండాఫ్ ఫోకస్ చేయాల్సింది. 

ప్లస్ పాయింట్స్:

విజయ్, రాశికన్నా, ఐశ్వర్య రాజేష్ ల యాక్టింగ్
పారిస్ సన్నివేశాలు
శీనయ్య పాత్ర

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్
స్లో గా సాగే సన్నివేశాలు
క్లైమాక్స్

టాగ్ లైన్:  సినిమాలో సోల్ మిస్ అవ్వడం, ముల్టీఫ్లెక్ సినిమా కావటంతో కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. వరల్డ్ ఫేమస్ లవర్.. అవేరేజ్ అనే చెప్పాలి.

రేటింగ్ : 2.5/5


   Politics

   Lifestyle