HomeTelugu reviews

అశ్వథ్థామ రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా
Published By :  Lasya Raghavaraju Image Image
Naga Shourya Ashwathama Review
Friday Jan 31, 2020
గణ ( నాగ శౌర్య) కు చెల్లెలు ప్రియ(సర్గున్ కౌర్) అంటే ఎంతో ఇష్టం. చెల్లెలుకు రవి (ప్రిన్స్) తో పెళ్లి కుదరడం తో అమెరికా నుండి గణ హైదరాబాద్ వస్తాడు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ప్రియ ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ఎందుకు ఆలా చేసుకుందా అని ఆరా తీయగా ఆమె గర్భవతి అని తెలుస్తుంది. కానీ ఆమెకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు ఉండవు. కానీ ఆమె గర్భం దాలుస్తుంది. తన చెల్లెలు ప్రేగ్నంట్ ఎలా అయిందన్న విషయాన్ని ఛేదించడం మొదలుపెడతాడు.  తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్‌లో తెలుసుకుంటాడు. అసలు దీనికి కారణం ఎవరు.. దేనికోసం చేస్తున్నారు..నేహ (మెహరీన్‌)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ (జిష్షు సేన్ గుప్తా) కు ఈ కథ కు ఎలాంటి సంబంధం ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నటీనటుల ప్రదర్శన

ఇప్పటివరకు నటించిన సినిమాలతో ల‌వ‌ర్‌బోయ్‌ ఇమేజ్ సాధించుకున్న నాగ శౌర్య..మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఈ సినిమా ఎన్నుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లలో హై వోల్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు ఎమోషనల్ సీన్స్ లో కూడా రాణించాడు. ఈ మూవీ లో మాస్ హీరోగా కనిపించాడు. అలాగే రచయిత గా తనలోని మరోకోణాన్ని పూర్తిస్థాయి లో బయటకు తీసి మెప్పించాడు. మెహ్రీన్ కు పెద్ద స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బానే చేసింది.  సైకో గా కనిపించిన జిసూసేన్ ఆకట్టుకున్నాడు. శౌర్య చెల్లి గా నటించిన సర్గున్ తన మేరకు నటించి మెప్పించింది. అతనికి చెప్పిన డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది. హరీష్ ఉత్తమన్ రోల్ కూడా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ప్రిన్స్ , పోసాని , సత్య మొదలగు వారు వారి వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం 

శౌర్య అందించిన కథకు దర్శకుడు రమణ తేజ న్యాయం చేసాడనే చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆకట్టుకున్నప్పటికీ..సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నిరాశ పరుస్తాయి. యాక్షన్‌ సీన్స్‌ బాగున్నప్పటికీ, క్లైమాక్స్ సాదాసీదాగా ఉండడం ప్రేక్షకులను నిరాశ పరిచింది.  శ్రీ చరణ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది..జిబ్రాన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమా కు హైలైట్ గా నిలిచింది. మనోజ్‌ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లలో మనోజ్‌ తన సినిమాటోగ్రఫీతో ఆకట్టుకున్నాడు. ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయిందని రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు  చనిపోయేవాడా?’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.  ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. 

ప్లస్ పాయింట్స్ :

నాగ శౌర్య, జిసూసేన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

నెమ్మదిగా సాగే కథనం
క్లయిమాక్స్
సాంగ్స్

తీర్పు : క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి  ‘అశ్వథ్థామ’ బాగా నచ్చుతుంది.

రేటింగ్ : 2.5/5

   Politics

   Lifestyle