HomeTelugu reviews

రవి తేజ 'డిస్కో రాజా' మూవీ రివ్యూ
Published By :  Lasya Raghavaraju Image Image
Ravi Teja Disco Raja Movie Review
Friday Jan 24, 2020
కథ 

లడాక్‌లో వాసు (రవితేజ) పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు. వాసు మృతదేహం మంచులో కూరుకుపోతుంది. మరోవైపు ఆయన కోసం ఢిల్లీలో ఆయన కుటుంబం అంతా వేచి చూస్తుంటుంది.  మూడున్నర దశాబ్దాల తారవాత వాసు డెడ్ బాడీని పర్వతారోహకులు చూస్తారు. ఆ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. సైన్స్ ల్యాబ్ లో ఛీఫ్ డాక్టర్ చేసిన ప్రయోగంతో చనిపోయిన వాసు మళ్లీ బతుకుతాడు. కానీ వాసు గతం మర్చిపోతాడు. తన గతాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో మద్రాస్ వెళ్తాడు. అక్కడ డిస్కో రాజా(రవితేజ) గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? సేతుకు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? వాసును ఎందుకు చంపేస్తారు.. డిస్కో రాజా ఎలా చచ్చిపోతాడు అనేది అసలు కథ..

నటీనటుల ప్రదర్శన

రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న రవి తేజ ఈ చిత్రంలో విభిన్నంగా అనిపిస్తాడు. డిస్కో రాజాగా ఫ్లాష్ బ్యాక్ లో మాస్ రాజా ఎనర్జీకి ఆయన అభిమానులు ఫిదా అయిపోతారు. మూడు భిన్నమైన పాత్రలలో  రవితేజ తన మార్క్ మానరిజమ్స్ ,టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్య హోప్‌కు స్క్రీన్‌పై చాలా తక్కువసేపే కనిపిస్తారు. దాంట్లో పాయల్ పాత్రకు కొంత ప్రాధాన్యత ఉంటుంది. హెలెన్ పాత్రలో ఆమె నటన బాగుంది. విలన్ పాత్రలో నటించిన బాబీ సింహా అదరగొట్టాడు.  ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఏదో మ్యాజిక్ ఉంటుంది. సునీల్ నటన ఈ చిత్రంలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్ చంపేసాడు. ఇక, సత్య, వెన్నెల కిషోర్ ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్లంతా ఓకే.

సాంకేతిక విభాగం 

టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి విలక్షణ సినిమాల తర్వాత ఆనంద్ నుంచి వచ్చిన సినిమా డిస్కో రాజా.  రవి తేజ బాడీ లాంగ్వేజ్ ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు అనిపిస్తోంది.  ప్రతి సీన్ లో తన మార్క్ మేకింగ్ ని చూపించాడు.  తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మంచి బూస్ట్ ని అందించాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఐస్ ల్యాండ్‌లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ క్రిప్స్ గా ఉంది. ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. బాబీ సింహాను చంపిన తర్వాత వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది.

చివరి మాట :  రవితేజ-వి ఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన డిఫెరెంట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా డిస్కో రాజా

రేటింగ్ : 3/5

   Politics

   Lifestyle