HomeTelugu reviews

సరిలేరు నీకెవ్వరు రివ్యూ
Published By :  Ravi Koneri Image Image
Sarileru Neekevvaru Review ; Sarileru Neekevvaru Rating
Saturday Jan 11, 2020
కథ:

భారతి (విజయశాంతి) కర్నూల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. మంచిని మంచి చెడును చెడు అని ధైర్యంగా చెప్పే భారతికి ఇద్దరు కుమారులు, ఇద్దరూ ఆర్మీలో ఉన్నారు. ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. అజయ్ (మహేష్ బాబు) ఆ వార్తను భారతికి తెలుపడానికి కర్నూల్ కు వస్తాడు. కానీ భారతి తన కుటుంబంతో పాటు అక్కడనుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. భారతి ఎక్కడ ఉంది ? ఆమెకు ఏమి జరుగుతుంది? ఇందులో ఎమ్మెల్యే నాగేంద్ర (ప్రకాష్ రాజ్) పాత్ర ఏమిటి? మధ్యలో సంస్కృతి *రాష్మిక) ఎవరు ? సమస్యల్లో ఇరుక్కున్న భారతి (విజయశాంతి)కి అజయ్ అండగా ఎలా నిలిచాడు అన్నది చిత్ర కథాంశం. 

నటీనటులు:

దూకుడు తర్వాత  మహేష్ నుంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు సరిలేరు నీకెవ్వరు సినిమా పండుగే అని చెప్పాలి. మహేష్ బాబు ఆర్మీ అధికారిగా, భారతి కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రలకి  నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసాడు. నటుడిగా ఈ చిత్రంతో మహేష్ బాబు మరింత ఇంప్రెస్‌ చేస్తాడు.  డ్యాన్స్ లు కానీ, ఫైట్లు కానీ కామెడీ కానీ మహేష్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. రాష్మిక మందన్న అందంగా కనిపిస్తూనే తనకి ఇచ్చిన స్కోప్‌లోనే నటిగా ప్రతిభ చూపించింది.  విజయశాంతి పాత్ర చాలా హుందాగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. కంబ్యాక్ కు సరైన సినిమా. ప్రకాష్ రాజ్ అవ్వడానికి ఇందులో విలన్ అయినా చాలా షేడ్స్ ఉన్నాయి. తన పాత్రను తీర్చిదిద్దిన విధానమే సరికొత్తగా ఉండడంతో ప్రకాష్ రాజ్ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతటా మహేష్ తోనే కనిపిస్తాడు. సంగీత కూడా తన పాత్రతో అలరిస్తుంది. బండ్ల గణేష్, రావు రమేష్, హరితేజ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారనే చెప్పాలి. 

సాంకేతిక నిపుణులు:

ఎఫ్2 చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను దృష్టిలో ఉంచుకునే సరిలేరు నీకెవ్వరు సినిమా తీసినట్టున్నాడు. 
ఫాన్స్ ఈలలు వేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో.  కథ పాతదే అయినా అనిల్ రావిపూడి చెప్పిన విధానం ప్రేక్షకుడు సంతృప్తిపడుతాడు. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. మహేష్ ఇంట్రడక్షన్ సీన్, ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఫారెస్ట్ ఫైట్.. ఇలా చాలా సన్నివేశాల్లో దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. తమన్నా ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ ప్లస్. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మరికాస్త పదునుగా ఉంటే బాగుండేది. సినిమా లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డైలాగులు చాలా బాగున్నాయి.

బలాలు

మహేశ్ బాబు
విజయశాంతి
కామెడి
యాక్షన్ సన్నివేశాలు

బలహీనతలు

ద్వితీయార్ధం
క్లైమాక్స్

చివరిమాట : సరిలేరు నీకెవ్వరు మహేష్ అభిమానులకి పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. 

రేటింగ్ : 3/5

   Politics

   Lifestyle