HomeTelugu Reviews

ప్రతిరోజు పండగే రివ్యూ
Published By :  Lasya Raghavaraju Image Image
Sai Tej-Raashi Khanna's Prathiroju Pandage Review
Friday Dec 20, 2019
కథ 

నలుగురు పిల్లలు విదేశాల్లో సెటిల్ అవడంతో ఒంటరిగా రాజమండ్రిలో ఉంటాడు సత్యరాజ్. తన దగ్గర ఎవరు లేకపోవడం, తనను చూడడానికి కూడా పిల్లలకు ఖాళీ లేకపోవడంతో మానసికంగా కృంగిపోతున్న తరుణంలో సత్యరాజ్ కు లంగ్ క్యాన్సర్ అని తెలుస్తుంది.  తాత కోసం అమెరికా నుంచి రాజ‌మండ్రిలో దిగుతాడు మ‌న‌వ‌డు సాయి తేజ్. తాతని చివరిదశలో సంతోషంగా ఉంచాల‌నుకున్న సాయి తేజ్ విదేశాల్లో సెటిల్ అయిన స‌త్య‌రాజ్ నలుగురు పిల్లలను ఇండియాకి రప్పిస్తాడు. తాతను సంతోషంగా ఉంచాలనే టార్గెట్ లో భాగంగా టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా (రాశిఖన్నా)ను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాయితేజ్ ఎదుర్కొన్న 
ఇబ్బందులేమిటి? చివరికి సాయితేజ్ తన తాతయ్యకు తన పిల్లలతో గడపాలన్న లోటును తీర్చాడా? ఇందులో మెలిక ఏమిటి? అనేది “ప్రతిరోజూ పండగే” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం. 

నటీనటుల ప్రదర్శన

చిత్రలహరి విజయంతో జోరు మీదున్న సాయితేజ్ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా, కొత్త లుక్ తో కనిపించాడు. కామెడీ సీన్స్ కంటే ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు.  సత్యరాజ్-సాయితేజ్ ల నడుమ తాత-మనవడు కెమిస్ట్రీ భలే వర్కవుట్ అయ్యింది. ఆ ఏజ్ వాళ్ళందరూ ఈ పాత్రలకి బాగా కనెక్ట్ అవుతారు. సత్యరాజ్  న‌ట‌న ప్ర‌ధాన హైలైట్. తాను ఎలాంటి పాత్రలోనైనా జీవించగలను అని సత్యరాజ్ మరోసారి ప్రూవ్ చేసుకొన్నారు. అలాగే.. రావు రమేష్ లోని ఫుల్ పొటెన్షియల్ ను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రమిదే. రావు రమేష్ లోని కామెడీ, ఎమోషనల్ యాంగిల్ ను మారుతి బాగా వాడుకున్నాడు. టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నాగా 
రాశిఖన్నా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్ గా ఆకట్టుకొంది. మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే.. గ్రామీణ యువతిగా లంగాఓణిలో రాశి మరింత అందంగా అలరించింది. ఎమోషన్స్ లోనూ తన సత్తా చాటుకొంది.  హరితేజ కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. సత్యం రాజేష్-అజయ్ ల పాత్రలు ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.  

సాంకేతిక విభాగం 

క‌థ పాతదే అయినా కామెడీ.. సెంటిమెంట్ పాళ్లు ఏమాత్రం మిస్ కాకుండా దర్శకుడు మారుతి క‌న‌బ‌రిచిన ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించి తీరాలి. ఎంటర్టైన్మెంట్ నే ప్రధాన అంశంగా ఎంచుకున్న మారుతి ఫస్ట్ హాఫ్ వరకూ అందులో సక్సెస్ అయ్యాడు .. కానీ సెకండ్ హాఫ్ విషయం లో తడబడ్డాడు అనే చెప్పాలి. ద్వితీయార్ధంలో చాలా చోట్ల 'శతమానం భవతి’ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది ప్రేక్షకులకి . ఈ సినిమాకి థ‌మ‌న్ అందించిన సంగీతం మరొక అస్సెట్. సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. డీసెంట్ బ్యాక్ గ్రౌండ్  స్కోర్ తో ఆక‌ట్టుకున్నాడు. రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని ప‌ల్లె ప‌ట్టు అందాల్ని జ‌య‌కుమార్ కెమెరాలో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.సెకండ్ హాఫ్ ఎడిటింగ్ సరిగా లేదు.  నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకున్నాయి.

ఓవరాల్ గా సాయి తేజ్ - రాశి ఖన్నా కెమిస్ట్రీ, కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్ కోసం ఫామిలీ ఆడియన్స్ “ప్రతిరోజూ పండగే” చిత్రాన్ని ఒకసారి ఏ ఇబ్బంది లేకుండా చూడొచ్చు.  

రేటింగ్ : 2.5/5

   Politics

   Lifestyle