HomeTelugu reviews

తిప్పరా మీసం రివ్యూ
Published By :  Lasya Raghavaraju Image Image
Thipparaa Meesam Review and Rating
Friday Nov 08, 2019
కథ :

చిన్నప్పుడే చెడు స్నేహాల వల్ల డ్రగ్స్ కు బానిసవుతాడు మణి శంకర్ (శ్రీవిష్ణు). దీంతో అతన్ని డాక్టర్ సలహాతో రీహాబిలేషన్ సెంటర్ లో జాయిన్ చేస్తుంది తల్లి (రోహిణి). తనను తల్లి ఇలా దూరంగా ఉంచుతుందన్న కారణంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు మణి. దీంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక పబ్ లో డీజేగా పని చేస్తున్నాడు. మౌనిక (నిక్కీ తంబోలి)ను ప్రేమిస్తాడు. డబ్బుల కోసం స్నేహితులతో పందాలు కాసి ఓడిపోతాడు. అలా 30 లక్షల అప్పు పేరుకుపోతుంది మణి శంకర్ కు. అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మణిశంకర్ ను చంపేస్తామని బెదిరిస్తారు. అప్పుడు తల్లి దగ్గరకు వెళ్లిన మణి శంకర్ ఏం చేశాడు ? ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు ? వాటిని ఎలా పరిష్కరించగలిగాడు ? నిక్కీ తంబోలి పాత్ర ఏంటి ? చివరకు ఏం జరిగింది ? అనేది తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :

మొదటినుంచి వైవిధ్యమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుని నటుడిగా నిరూపించుకున్న శ్రీ విష్ణు ననటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  పాత్రిర ఏదైనా తనదైన శైలిలో సహజ నటనను కనబరిచే శ్రీ విష్ణు మ‌ణిశంక‌ర్ అనే పాత్ర‌లో భిన్నమైన ఎమోషన్స్ ను పండించే అవకాశం దక్కింది. త‌ల్లిని ద్వేషించే కొడుకు పాత్ర‌లో, కుటుంబం కోసం నేర‌స్థుడిగా మారే కొడుకుగా శ్రీవిష్ణు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన రోహిణి మరోసారి అద్భుత నటన పండించారు. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో నటించింది అని చెప్పడం కంటే జీవించేసింది అని చెప్పచ్చు. హీరోయిన్ నిక్కీ తంబోలీ పాత్ర చాలా చిన్నది. కానీ ఆమె తన నటనతో ఆకట్టుకుంది.  బెనర్జీకి కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర పడింది.  ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ తీసుకున్న పాయింట్ మంచిదే. కానీ దానిచుట్టూ అల్లుకున్న సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకోవడంలో తడబడ్డాడేమో అన్పిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక్క శ్రీవిష్ణు పాత్రనే హైలైట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు.  అలాగే కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. సినిమా ఆఖరి 30 నిమిషాలు, ఇంటర్వెల్ సీన్ బాగున్నాయి. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పొచ్చు. అయితే పాటలు పెద్దగా ఆకట్టుకోవు. సిద్ కెమెరా ప‌నితనం ఫర్వాలేదన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా ఉంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

మదర్ సెంటిమెంట్, అండర్ వాటర్ ఎపిసోడ్, ఫారెస్ట్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్స్ కాగా స్లో పేస్, ఆసక్తి లేని సన్నివేశాలు సినిమాకి మైనస్. 

ఒక్క మాటలో చెప్పాలంటే క‌థ‌, క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా ఉండుంటే సినిమా బావుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది. 

రేటింగ్ : 2.5/5