HomeTelugu politics

లోటస్ పాండ్‌లో కార్యకర్తలతో వైయస్ షర్మిల ఆత్మీయ సమావేశం
Published By :  Divya Valluru Image Image
Jagan Sister YS Sharmila meeting with her supporters in Lotus Pond
Tuesday Feb 09, 2021

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టబోతున్నట్లు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలిపోయింది. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో షర్మిల సమావేశం నిర్వహించనున్నారు.  మంగళవారం ఆమె పార్టీకి పునాది వేయనున్నారని తెలుస్తోంది. 

లోటస్‌పాండ్‌లోని బ్రదర్‌ అనిల్‌ కార్యాలయంలో ఈ ఉదయం  షర్మిల కీలక సమావేశం నిర్వహించనున్నారు.  వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.  ఉదయం పదిగంటలకు షర్మిల ఆత్మీయ సమావేశం నిర్మహించనున్నారు.  ఈ సమావేశంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులతో పాటు షర్మిల అనుచరులు పాల్గొంటారని సమాచారం. మొదట నల్గొండ జిల్లా నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాదంటూ షర్మిల ఫొటోలతో స్లోగన్లను సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాదు, ఛలో లోటస్ పాండ్ పేరుతో సోషల్మీడియాలో పోస్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉంటే, వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్‌ పాండ్‌‌ను ఖాళీ‌చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలో షర్మిల కొత్త ఇంటిని తీసుకున్నట్లు సన్నిహితులుచెబుతున్నారు. త్వరలోనే లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలి ఇంటికి షర్మిల మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, కోమటిరెడ్డి బ్రదర్స్‌, అలాగే ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు షర్మిలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారన్న ఊహగాహానాలు జోరందుకున్నాయి. 

   Politics

   Lifestyle