HomeTelugu politics

జీహెచ్ఎంసీ కౌంటింగ్ 85 స్థానాల్లో లీడింగ్ లో ఉన్న బీజేపీ
Published By :  Lasya Raghavaraju Image Image
GHMC Elections counting BJP leads in 85 places TRS in 29
Friday Dec 04, 2020
గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు.  

ఉద‌యం 8 గంట‌లకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కాగా, మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు 1926 పోల‌య్యాయి. ఇందులో కొన్ని తిర‌స్క‌రించ‌బ‌డ్డాయి. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో అత్య‌ధికంగా బీజేపీకి పోల‌య్యాయి. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మ‌రికాసేప‌ట్లో తొలి రౌండ్ ఫ‌లితం వెల్ల‌డి కానుంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

అందుతున్న వివరాల ప్రకారం  లీడింగ్ ఇలా.. 

టీఆర్ఎస్ : 29

బీజేపీ : 85

కాంగ్రెస్ : 2

ఎంఐఎం- 17

టీడీపీ - 00

ఇతరులు-00

   Politics

   Lifestyle