బాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ శివసేన గూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె పార్టీలో చేరనున్నట్టుగా శివసేన నాయకుడొకరు అధికారికంగా ప్రకటించారు.
2019 పార్టమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నార్త్ ముంబై స్థానం నుంచి బిజెపి సీనియర్ నేత గోపాల్ చినయ్య పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మార్చిలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ఊర్మిళా సెప్టెంబర్ లో పార్టీని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పనిచేశాయని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వస్తున్న ఊర్మిళ రేపు కొత్తగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.
ఊర్మిళా చాలా కాలం నుంచి శివసేనలో చేరుతారనే చర్చ మహారాష్ట్రలో జోరుగా సాగుతుంది. ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం శాసనమండలికి నామినేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల మహారాష్ట్ర మహా వికాస్ అగాడి ప్రభుత్వం 12 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు పంపింది. ఇందులో ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ ఖాడ్సే, రాజుశెట్టి, యశ్పాల్ బింగే, ఆనంద్, కాంగ్రెస్ నుంచి రజనీపాటిల్, సచిన్ సావంత్, ముజాఫర్ హుస్సేన్, అనిరుధ్ పేర్లు ఉన్నాయి. శివసేన ఊర్మిళా మండోద్కర్, చంద్రకాంత్ రఘువంషి, విజయ్ కరంజ్కర్, నితిన్ బంగుడే పాటిల్ పేర్లను సూచించింది. ఈ క్రమంలోనే ఆమె శివసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.