HomeTelugu politics

జీహెచ్ఎంసీ పోటీ నుంచి తప్పుకున్న జనసేన పార్టీ
Published By :  Divya Valluru Image Image
Pawans Janasena party left from GHMC Elections decides to support BJP
Saturday Nov 21, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీకి దిగుతున్నామని ప్రకటించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 గంటలు తిరక్కుండానే వారికి షాకిచ్చాడు.  ఎన్నికల్లో పోటీ చేస్తామని నిన్న ప్రకటించిన పవన్ ఈ రోజు అదంతా వట్టిదే GHMC ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారని జనసేనాని తేల్చేసారు. 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపిన తర్వాత జనసేనాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకుడు లక్ష్మణ్ పవన్‌ను బుజ్జిగించి పోటీ నుంచి తప్పించారు. తొలుత పొత్తుపై చర్చలు జరిగాయని, తర్వాత పోటీ నుంచి తప్పుకోవడంపై చర్చించారని సమాచారం. ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ మంతనాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి జనసేనను బీజేపీ బరి నుంచి బయటికి పంపింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం తాము బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో మాట్లాడతామని, ఎవరూ డీలా పడిపోవద్దని  అన్నారు. 

పవన్ కళ్యాణ్ నిలకడ లేని స్వభావంపై ప్రజలు కొంతవరకు అసహనం చూపుతున్నారు. ముందు పోటీచేస్తున్నాం అని ప్రకటించడం,తరువాత వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం. అలవాటు అయిపోయింది. ఈ ధోరణి మార్చుకోకపోతే ఇకమీదట పవన్ కళ్యాణ్ పై ప్రజలలో నమ్మకం పోతుంది.

   Politics

   Lifestyle