HomeTelugu politics

దుబ్బాక కౌంటింగ్ : మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యం
Published By :  Lasya Raghavaraju Image Image
BJP Raghunandan Rao leading in dubbaka by elections counting
Tuesday Nov 10, 2020
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.  మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 341 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. తొలి రౌండ్ లో 7445 లెక్కించగా.. మొదటి రౌండ్ లో 7446 టీఆర్ఎస్ 2867, బీజేపీ 3208, కాంగ్రెస్ 648, నోటా 24 ఓట్లు పోలయ్యాయి. 

మొదట పోస్టల్ బ్యాలెట్‌, సర్వీస్ ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ముందున్నా ఆ తర్వాత రెండు రౌండ్లలో వెనుకబడిపోయారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి 279 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండవ రౌండ్ లో టీఆర్ఎస్ 1282, బీజేపీ 1561, కాంగ్రెస్ 648 పోలయ్యాయి.  రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి మొత్తం 620 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో  కౌంటింగ్ కేంద్రం బయట బీజేపీ కార్యకర్తలు, నేతలు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. 

మూడో రౌండ్‌లోనూ బీజపీ ఆధిక్యంలో కొనసాగింది. దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్‌ల కౌంటింగ్‌ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌ రావు ఇప్పటిదాకా 1885 ఓట్ల ఆధిక్యం సాధించారు.

   Politics

   Lifestyle