HomeTelugu politics

బీహార్ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్ "గ్రాండ్" విక్టరీ దిశగా ఆర్జేడీ
Published By :  Lasya Raghavaraju Image Image
bihar tejashwi yadavs alliance leading in bihar assembly elections
Tuesday Nov 10, 2020
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.  రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.  243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జెడి దూసుకుపోతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు వెల్లడి అయిన లెక్కల ప్రకారం చూస్తే 107 స్థానాల్లో ఆర్జెడి, సహా కూటమి లీడింగ్ లో ఉంది. 
 హసన్‎పుర్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉండగా.. రాఘోపూర్ లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు.

కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 122 సీట్లు కావాల్సివుంది. ఈ సీట్లను మహా కూటమి సులభంగా సాధించే దిశగా ఈ ట్రెండ్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎన్డీయేకు 125 సీట్లు రాగా, మహా కూటమికి 110, ఎల్జేపీకి 2, ఇతరులకు ఆరు సీట్లు వచ్చాయి. ఇపుడు ఈ ఫలితాలు అలాగే తిరగబడ్డాయి. ఫలితంగా మహా కూటమి 103 చోట్ల ఎన్డీయే 96 చోట్ల, ఎల్జేపీ ఆరు చోట్ల, ఇతరులు 5 చోట్ల ఆదిక్యంలో ఉన్నారు. మరో 33 స్థానాలు ట్రెండ్స్ తెలియాల్సివుంది.

ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా అదో రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వయసు ప్రస్తుతం 31 ఏళ్ళు మాత్రమే. మరి చూడాలి ఈ ట్రెండ్స్ చివరి వరకూ నిలబడి ఆయన ఆధ్వర్యంలోని కూటమి గెలుస్తుందేమో చూడాలి మరి.

   Politics

   Lifestyle