HomeTelugu politics

ద్రవిడ పార్టీలతో అస్సలు పొత్తు పెట్టుకోం అని చెప్పేసిన కమల్
Published By :  Lasya Raghavaraju Image Image
Kamal Haasan says MNM will form an alliance with the people in TN Elections
Tuesday Nov 03, 2020
వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్(MNM)పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, తృతీయ కూటమి ఏర్పాటే తమ ధ్యేయమని లోకనాయకుడు ప్రకటించారు. సోమవారం ఉదయం టి.నగర్‌లోని స్టార్‌ హోటల్‌లో పార్టీ జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల సమావేశం కమల్‌హాసన్‌ అధ్యక్షతన జరిగింది.  

ఈ సమావేశంలో కమల్‌ హాసన్‌ ఉద్వేగంగా ప్రసంగిస్తూ "అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, అందుకు తగినట్టుగా జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులంతా తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలను కలుపుకుని తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా అధికార అన్నాడీఎంకే పార్టీతోగానీ, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతోగానీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, ద్రావిడ పార్టీలకు దూరం గానే ఉంటామని కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. వచ్చే యేడాది మక్కల్‌ నీదిమయ్యం నాయకత్వంలోనూ మెగా కూటమి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు". 

కాగా, గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తుకి కమల్ సిద్ధపడ్డాడు. అయితే, డీఎంకే పార్టీతో పొత్తు లేకపోతేనే అంటూ కాంగ్రెస్ కు షరతు పెట్టాడు. అయితే, కమల్ ని లైట్ తీసుకున్న కాంగ్రెస్ డీఎంకేతో పొత్తు పెట్టుకుంది.  తమిళనాడులోని ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్-డీఎంకే కూటమి దక్కించుకుంది. కాగా, వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతోనే కలిసి ముందుకుసాగాలని కాంగ్రెస్ నిర్ణయించుకోగా బీజేపీతో కలిసి పోటీ చేయాలని అధికార అన్నాడీఎంకే ఆలోచన చేస్తోంది. 

ఇక, రజనీకాంత్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అసలు ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తదా..లేదా అనేది కూడా సస్పెన్స్.

   Politics

   Lifestyle