HomeTelugu politics

బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయశాంతి
Published By :  Lasya Raghavaraju Image Image
Vijayasanthi ready to say goodbye to Congress likely join BJP again
Wednesday Oct 28, 2020
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గ‌లనుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై  చెప్పనున్న‌ట్టు తెలుస్తోంది.  చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విజ‌య శాంతి బిజెపి పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 

సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, విజయశాంతిని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. దీంతో ఆమె పార్టీలోకి రావ‌డం కన్ఫర్మ్ అయిన‌ట్టు చెబుతున్నాయి బీజేపీ వ‌ర్గాలు. ఈ సమావేశానికి కొద్దిరోజుల కిందట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్‌ 10 లోపు ఢిల్లీ పెద్దల సమక్షంలో ముహూర్తం చూసుకుని రాములమ్మ కమలం గూటిలో చేరనున్నట్లు సమాచారం.

ఆలె న‌రేంద్ర శిష్యురాలిగా విజయశాంతి 1998వ సంవ‌త్స‌రంలో బీజేపీలో చేరారు. బీజేపీ విమెన్స్‌ వింగ్‌ (భారతీయ మహిళా మోర్చా) సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించారు. తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత కొన్ని నెలలుగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.

   Politics

   Lifestyle