HomeTelugu politics

క‌మ‌ల్‌నాథ్ ఐటెం వ్యాఖ్య‌లపై మండిపడ్డ రాహుల్‌గాంధీ
Published By :  Divya Valluru Image Image
Rahul Gandhi agressive response on Kamal Nath's "Item" Comment
Tuesday Oct 20, 2020
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ త‌ర‌ఫున అసెంబ్లీ ఎన్న‌కల‌ బ‌రిలో ఉన్న మ‌హిళా అభ్య‌ర్థి ఇమార్తి దేవిని ఐట‌మ్ అని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ చేసిన వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. మహిళానేత పై కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్‌గాంధీ తప్పుబట్టారు. 

క‌మ‌ల్‌నాథ్ మా పార్టీ స‌భ్యుడే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఉప‌యోగించిన భాష‌ను వ్య‌క్తిగ‌తంగా తాను స‌హించ‌న‌ని చెప్పారు. క‌మ‌ల్‌నాథ్ ఒక మ‌హిళ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.   ఆయ‌నే కాదు ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రు చేసినా తాను ఒప్పుకోను అని రాహుల్‌గాంధీ మండిప‌డ్డారు.   

రాహుల్ గాంధీ విమ‌ర్శ‌పై మీడియా ప్ర‌తినిధులు క‌మ‌ల్‌నాథ్ స్పంద‌న కోర‌గా.. అది రాహుల్‌గాంధీ అభిప్రాయం అన్నారు. తాను ఏ సంద‌ర్భంలో అలాంటి ప‌దం ఉప‌యోగించాల్సి వ‌చ్చిందో ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇచ్చాన‌ని చెప్పారు.  ఇమార్తి దేవికి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌బోతున్నారా అన్న విలేక‌రుల ప్ర‌శ్న‌కు ఈ విష‌యంలో తాను ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని క‌మ‌ల్‌నాథ్ అడిగారు. తాను ఎవ‌రినీ ఉద్దేశపూర్వ‌కంగా అవ‌మానించ‌న‌ప్పుడు ఎవ‌రిని క్ష‌మాప‌ణ కోరాల‌ని ప్ర‌శ్నించారు. 

కాగా, మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాదిథ్య సింధియాతో పాటు డబ్రాలో ప్రస్తుతం బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవి, మొత్తం 22 మంది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం తెలిసిందే. భారీగా పార్టీ ఫిరాయింపులతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది.

   Politics

   Lifestyle