HomeTelugu politics

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
Published By :  Divya Valluru Image Image
Atchannaidu appointed as new TDP State President in AP
Monday Oct 19, 2020
టీడీపీ రాష్ట్ర కమిటీలను పార్టీ అధిష్టానం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని నియమించారు. 

27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు. 

కమిటీలో వైస్ ప్రెసిడెంట్లుగా ఆరుగురు ఉండగా.. సెంట్రల్ జనరల్ సెక్రటరీలుగా 8మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఏపీ టీడీపీ స్టేట్ కమిటీని ప్రకటించలేదు. కేవలం అధ్యక్షుడి పేరు మాత్రమే వెల్లడించారు. ఏపీ రాష్ట్ర కమిటీని మరో వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

   Politics

   Lifestyle