HomeTelugu politics

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో కవిత గెలుపు
Published By :  Divya Valluru Image Image
KCR daughter Kavita wins Nizamabad MLC by election
Monday Oct 12, 2020
ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఘ‌న విజ‌యం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ చరిత్రలోనే అత్యంత భారీ మెజార్టీతో కవిత గెలిచి రికార్డు సృష్టించారు. టీఆర్‌ఎస్‌కు 728.. బీజేపీకి 56.. కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.  ఇక కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి. 

కౌంటింగ్ ప్రక్రియలో మొదటి రౌండ్ లో 600 ఓట్లు లెక్కించగా కవితకు 531 ఓట్లు పోల్ అయ్యాయి. లక్ష్మినారాయణకు 39, సుభాష్ రెడ్డికి 22 ఓట్లు పడ్డాయి. ఇందులో 8 చెల్లని ఓట్లు ఉన్నాయి. అటు రెండో రౌండ్ లోనూ కవితదే ఆధిపత్యం కొనసాగింది. మొత్తం 223 ఓట్లు లెక్కించగా కవితకు 197 ఓట్లు పడ్డాయి. లక్ష్మినారాయణకు 17, సుభాశ్ రెడ్డికి 7, రెండు చెల్లని ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో మొత్తం 823 ఓట్లకు గాను టీఆరెస్ అభ్యర్థి కవితకు 728 పోల్‌ అయ్యాయి. ఇందులో పోస్టల్ ద్వారా వచ్చిన రెండు ఓట్లు కూడా ఉన్నాయి. అటు రెండు రౌండ్లు కలిపి బిజెపి అభ్యర్థి లక్ష్మీ నారాయణకు 56 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు పడ్డాయి. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

ఈ సంద‌ర్భంగా క‌విత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌హ‌క‌రించి, గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు, చైర్మ‌న్ల‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌విత ధ‌న్య‌వాదాలు చెప్పారు. 

14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

   Politics

   Lifestyle