HomeTelugu politics

సినీ నటి కుష్బూ సుందర్ బీజేపీలో చేరిపోయింది
Published By :  Divya Valluru Image Image
Actress Kushboo Sundar officially joins BJP party
Monday Oct 12, 2020
ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. ఆమె ఈరోజు అధికార బీజేపీలో చేరారు.  ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆమె కాషాయం కండువా క‌ప్పుకున్నారు. గ‌త ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు.  

కుష్బూ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. పార్టీలో కొందరు నేతలు గ్రౌండ్ రియాల్టీ తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ ని వీడుతున్న‌ట్లు రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  యాల్టీ తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ఖుష్బూ ఇవాళ త‌న  రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  

2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఖుష్బూ బీజేపీ చేరనుండటం ఆ పార్టీకి లాభిస్తుందని రాజకీయవర్గాలు అంటున్నాయి.  న్నాయి. 

   Politics

   Lifestyle