HomeTelugu politics

అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి
Published By :  Divya Valluru Image Image
Edapaddi K Palaniswami is AIADMK's CM candidate for 2021 elections
Wednesday Oct 07, 2020
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే  పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు నేడు తెరపడింది. అన్నాడిఎంకె సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కూడా సిఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరునే ప్రకటించారు. 

వాస్తవానికి డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం కూడా సీఎం అభ్యర్థిగా పోటీపడేందుకు ఆసక్తి చూపారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో గత కొన్నాళ్ళుగా ఈ అంశంలో అలజడి రేగింది. కానీ సుదీర్గ మంతనాల తర్వాత  పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే పార్టీ చీఫ్‌ ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకోసం ఒక కమిటీని నియమించినట్లు సమాచారం. 

2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 11 మందితో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రకటించింది.

   Politics

   Lifestyle