HomeTelugu politics

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుకు ఛాన్స్
Published By :  Lasya Raghavaraju Image Image
Kinjarapu Achannaidu set to be appointed AP TDP president
Tuesday Sep 22, 2020
ఏపీ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి పేరును పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తున్న అచ్చెన్నాయుడికి  అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారట. ఈ నెల 27న అచ్చెన్న నియామకానికి సంబంధించి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి గట్టిగా తీసుకకెళ్లడంలో అచ్చెన్న సమర్థుడని చంద్రబాబు భావిస్తున్నారు.  ఈ నెల పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇటీవల అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాం లో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 70 రోజులు జైల్లో ఉన్న ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. తనను అక్రమంగా ఇరికించారని ... ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నందుకే కేసులు బనాయించారని అచ్చెన్న పోరాడుతున్న విషయం తెలిసిందే. 

   Politics

   Lifestyle