HomeTelugu politics

కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖామంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా
Published By :  Lasya Raghavaraju Image Image
Akali dal leader Har Simrat Kour resigned as Cabinet Minister
Friday Sep 18, 2020
శిరోమణి అకాలీదళ్ లీడర్ హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖామంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి వెళ్లి ఆమె రాజీనామా సమర్పించారు. నిన్న పార్లమెంటులో ఎన్డీయే సర్కారు వ్యవసాయ చట్టాల సవరణ బిల్లును  ప్రవేశపెట్టిన క్రమంలో హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు.  ఈ ఉదయం రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు.

హర్ సిమ్రత్ కౌర్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం ఆమె రాజీనామాను ఆమోదించినట్లు ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలియజేశారు. 

కాగా, ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా అకాలీదళ్ కొనసాగుతోంది. కేంద్రం లోక్ సభలో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్లు.. ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్, ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్షూరెన్స్, ఫార్మ్ సర్వీసెస్ బిల్లు.. ఎస్సెన్షియల్ కమొడిటీస్ (అమెండ్ మెంట్) బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మూడు బిల్లులు తీసుకురావడంపై నిరసన గానే సిమ్రత్ కౌర్ రాజీనామా  చేశారు.

   Politics

   Lifestyle