HomeTelugu politics

టీ కాంగ్రెస్‌ నూతన ఇన్‌చార్జిగా మాణిక్యం ఠాగూర్‌
Published By :  Lasya Raghavaraju Image Image
Congress drops Ghulam Nabi Azad as Telangana Congress Incharge
Saturday Sep 12, 2020
తెలంగణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్‌చార్జి ఎన్నికయ్యాడు. టీ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్‌ స్థానంలో మాణిక్యం ఠాగూర్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 

ఆజాద్‌తో పాటు సీనియర్‌ నాయకులు మోతీలాల్‌ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్‌ వాస్నిక్, రణ్‌ దీప్‌ సింగ్‌ సూర్జేవాలాలకు చోటు కల్పించారు.

మాణిక్యం ఠాగూర్ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన NSUIలో స్టూడెంట్ నాయకునిగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆల్ ఇండియా ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని విరుధానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో మరోసారి విరుధానగర్ నుంచి రెండోసారి విజయం సాధించారు.

మరోవైపు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్‌ సభ్యులుగా చిదంబరం, రణ్‌దీప్‌ సూర్జేవాలా, తారిఖ్‌ అన్వర్, జితేంద్ర సింగ్‌లను తీసుకున్నారు. 

   Politics

   Lifestyle